కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇన్ సర్వీసు ఉపాధ్యాయుల కోసం విడుదల చేసిన టెట్ (TET) నోటిఫికేషన్‌పై తీవ్ర వ్యతిరేక్త వ్యక్తమవుతోంది. ఈ నోటిఫికేషన్‌పై ప్రభుత్వం వెంటనే పునరాలోచించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల సమైక్యత (STU) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టీకే జనార్దన, ఎంసీ సుంకన్న తీవ్రంగా డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఎస్టీయూ నాయకులు భారీ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇన్ సర్వీసు ఉపాధ్యాయుల టెట్ మార్గదర్శకాలలో అనేక అసంబద్ధమైన అంశాలు ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి విద్యార్థులకు పాఠాలు చెబుతూ అనుభవం గడించిన ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం పునరాలోచించకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు ఎస్‌. గోకారి, మహాదేవప్ప, ఎం. శ్రీధర్‌, సి. నరసింహుడు, ప్రదీప్‌ కుమార్‌, ఎల్లప్ప, రమణ, విగ్నేష్‌ తదితరులు పాల్గొని ప్రభుత్వ తీరుపై తమ నిరసనను వ్యక్తం చేశారు.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 28 Aug 2026 | 12:14 AM IST
Tags: