పండుగ వేళ యూటర్న్ తీసుకున్న పసిడి ధరలు
పండుగ సీజన్లో గత వారమంతా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు అక్టోబర్ 19న స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.380 పెరిగి రూ.1,48,040కి చేరగా, 22 క్యారెట్ల ధర రూ.350 పెరిగి రూ.1,35,700 వద్ద నిలిచింది. వెండి ధర కిలో రూ.2.4 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.