కాణిపాకం: కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ప్రత్యేక అలంకరణలో చిలుక వాహనంపై విహరించారు. ఆలయ కల్యాణ వేదిక వద్ద సిద్ది, బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవర్లకు అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి అత్యంత వైభవంగా కల్యాణోత్సవం జరిపించారు.

పూజా కార్యక్రమాల అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన చిలుక వాహనంపై కొలువుదీర్చి, మంగళవాయిద్యాల నడుమ పురవీధులలో ఘనంగా ఊరేగించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కాణిపాకానికి చెందిన రేపాకుల కుటుంబీకులు మోహన్‌శెట్టి, వారి సోదరులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ వేడుకల్లో ఆలయ ఈవో పెంచలకిషోర్‌తో పాటు పలువురు అధికారులు, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తరించారు.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 28 Aug 2026 | 01:54 AM IST
Tags: