డెస్క్: నేపాల్‌లో సంభవించిన భీకర మెరుపు వరదల కారణంగా అక్కడ చిక్కుకున్న మరియు గల్లంతైన ఆంధ్రప్రదేశ్ యాత్రికుల వివరాలను ఏపీ అధికారులు భారత రాయబార కార్యాలయానికి అధికారికంగా అందజేశారు. ఈ ప్రమాదంలో గల్లైంతన మరియు సహాయం కోసం ఎదురుచూస్తున్న యాత్రికుల వివరాలు

    • చొప్పరపు రమేశ్‌బాబు (53): ఆగస్టు 26 ఉదయం 8:13 గంటలకు చైనా సరిహద్దు ఇమ్మిగ్రేషన్ వద్ద చివరిసారిగా గుర్తించారు. రిచా టూర్స్ ద్వారా ఆయన ఆచూకీ కోసం అత్యవసరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

    • అన్నందేవర వెంకట్రామ్ (52): ఆగస్టు 25 రాత్రి రసువా–టిమురే (టిబెట్ సరిహద్దు) ప్రాంతంలో చివరిసారిగా గుర్తించబడ్డారు.

    • శశికుమార్ అట్లూరి: చైనాలోని గ్యిరోంగ్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్ద చివరిసారిగా గుర్తించినట్లు సమాచారం లభించింది. అయితే ప్రస్తుతం ఆయన ఉన్న కచ్చితమైన ప్రాంతాన్ని నిర్ధారించాల్సి ఉంది.

    • రాజ్యలక్ష్మి నిమ్మగడ్డ: గ్యిరోంగ్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్దే చివరిసారిగా గుర్తించినట్లు సమాచారం ఉండగా, ప్రస్తుత పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది.

    • భాస్కర్ శాస్త్రి సహా మరో ముగ్గురు: వీరంతా ప్రాణాలతో సురక్షితంగానే ఉన్నప్పటికీ, ప్రస్తుతం అక్కడే చిక్కుకుపోయారు. వీరిని సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు.

    • అపర్ణ కాకాని: ఆగస్టు 26 సాయంత్రం వరకు ఈమె క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందింది. అధికారుల బృందం ఈమె పరిస్థితిని ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తోంది.

    • అన్నందేవర ఆనాఘ (49): ఆగస్టు 25 రాత్రి రసువా–టిమురే ప్రాంతంలోనే చివరిసారిగా గుర్తించినట్లు సమాచారం ఉంది.

    • బాలసుబ్రహ్మణ్యం: ఈయన గల్లంతైనట్లు సమాచారం అందగా, ప్రస్తుతం ఆచూకీ తెలియరాలేదు. అధికారుల ఆధ్వర్యంలో అత్యవసర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 27 Aug 2026 | 05:40 PM IST
Tags: