షాద్‌నగర్: షాద్‌నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ మేనకోడలు రాణి శివకుమార్ వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు స్థానిక మాజీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు ఎలుగనమోని అంజయ్య యాదవ్ హాజరయ్యారు. ఆయనతో పాటు ప్రతిపక్షానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి తదితరులు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో పాటు వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన దంపతులు రాణి–శివకుమార్‌లను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో కలకాలం వర్ధిల్లుతుందని ఆకాంక్షించారు.


