షాద్‌నగర్: రాజా బహద్దూర్ వెంకటరామిరెడ్డి జయంతి సందర్భంగా షాద్‌నగర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. రాజా బహద్దూర్ వెంకటరామిరెడ్డి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని అన్నారు. సమర్థుడైన పోలీసు అధికారిగా సేవలందిస్తూనే, సమాజ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఆయనొనర్చిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. వెంకటరామిరెడ్డి విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారని, పేద విద్యార్థులకు హాస్టల్ వసతులు, విద్యా అవకాశాలు కల్పించేందుకు ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజహిత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్ ముదిరాజ్, రెడ్డి సేవా సమితి అధ్యక్షుడు, గ్రంథాలయ కమిటీ చైర్మన్ కొప్పుల మదన్ మోహన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఫరూక్‌నగర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు శ్రీధర్, కౌన్సిలర్లు పెంటయ్య మురళీమోహన్, రాజు నాయక్, నాయకులు బచ్చలి నరేష్, సయ్యద్ ఖదీర్, ముబారక్ అలీ ఖాన్, మాజీ జడ్పీటీసీ వెంకటరాం రెడ్డి, కొత్తపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ శ్రీధర్ రెడ్డి, గిరిజన ఆదివాసీ రాష్ట్ర కోఆర్డినేటర్ రఘు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు రాంబల్ నాయక్, పినపాక ప్రభాకర్, దొడ్డి శ్రీనివాస్, అబ్దుల్ రజాక్, శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ లట్టుపల్లి మోహన్ రెడ్డి, నాయకులు చెంది తిరుపతి రెడ్డి, చెంది మహేందర్ రెడ్డి, పందెం చెన్నారెడ్డి, పాండురంగారెడ్డి, విఘ్నేష్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సందీప్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, చంద్రపాల్ రెడ్డి, చందు నాయక్, జంగారి రవి, సందీప్ గౌడ్, వినాయక గౌడ్, మాధవులు యాదవ్, కత్తి చంద్రశేఖరప్ప, అన్వర్, ఇబ్రహీం, శ్రీహరి గౌడ్ తదితరులు హాజరై నివాళులర్పించారు.


