మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ కోట మైసమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమానికి అఖిల భారత యాదవ సంఘం తమ ఉదారతను చాటుకుంది. అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని సంఘం ఆధ్వర్యంలో రూ. 1,00,116 ఆర్థిక విరాళాన్ని సమకూర్చి ఆధ్యాత్మిక సేవలో భాగస్వాములయ్యారు.

మహేశ్వరం గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్, ఉపసర్పంచ్ జోరల రమేష్, మాజీ సర్పంచ్ స్వర్ణగంటి ఆనందం, సీనియర్ నాయకులు కర్రోళ్ల చంద్రయ్య ముదిరాజ్, శివగంగ ఆలయ చైర్మన్ అల్లే కుమార్‌లకు యాదవ సంఘం ప్రతినిధులు ఈ విరాళ మొత్తాన్ని అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠాపనకు సంబంధించిన ఏర్పాట్లు, ఉత్సవ నిర్వహణ ప్రణాళికలపై గ్రామ పెద్దలు, యాదవ సంఘం నాయకులు సుదీర్ఘంగా చర్చించారు.

ఆలయ నిర్మాణ, పునరుద్ధరణ కార్యక్రమాలకు తమ వంతు సామాజిక, ఆధ్యాత్మిక సహకారం అందించడంలో భాగంగానే ఈ విరాళాన్ని అందజేసినట్లు యాదవ సంఘం ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం పెద్దలు వంగూరి మల్లయ్య యాదవ్, దుడ్డు క్రిష్ణ యాదవ్, తెల్తీరి శ్రీశైలం యాదవ్, జె. నాగేష్ యాదవ్, వి. మల్లేష్ యాదవ్, ఎం. శ్రీనివాస్ యాదవ్, జి. శ్రీశైలం యాదవ్, టి. లక్ష్మయ్య యాదవ్, డి. రాములు యాదవ్, ఎ. లక్ష్మయ్య యాదవ్, ఎ. శ్రీశైలం యాదవ్, జె. రాఘవేందర్ యాదవ్, వి. శ్రీను యాదవ్, జి. రాజు యాదవ్, ఎ. చెన్నయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 10 Aug 2026 | 08:01 PM IST
Tags: