మహేశ్వరం: తెలంగాణ విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ అందెల శ్రీరాములు పలు ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాలను దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని నాదర్‌గుల్, బడంగ్‌పేట్, ప్రశాంతి హిల్స్, ఆర్కేపురం డివిజన్లలో వేడుకగా జరుగుతున్న బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

inline-img
బడంగ్‌పేట్‌లో మహా తొట్టెలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అందెల

ఈ సందర్భంగా అందెల శ్రీరాములు మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానంతో, భక్తి భావంతో ముడిపడి ఉందన్నారు. జగజ్జనని అమ్మవారి దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యంతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణలోని ప్రతి కుటుంబంపై అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

inline-img
బోనాల వేడుకల్లో పాల్గొన్న అందెల శ్రీరాములు, బీజేపీ నాయకులు

అనంతరం బడంగ్‌పేట్ గ్రామంలో 'టీం మహాకాళ్' ఆధ్వర్యంలో నిర్వహించిన మహా తొట్టెల ఊరేగింపు మహోత్సవంలో అందెల శ్రీరాములు పాల్గొని, తొట్టెలకు ప్రత్యేక పూజలు చేశారు. బోనాల ఉత్సవాలను ప్రజలంతా పవిత్రమైన భక్తిశ్రద్ధలతో, ఐక్యతతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య నాయకులు, మాజీ కార్పొరేటర్లు, స్థానిక పార్టీ ప్రతినిధులు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 10 Aug 2026 | 03:23 PM IST
Tags: