డెస్క్: భారతీయ పోస్టల్ శాఖలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ వెలువడింది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి ఆగస్టు నెలాఖరు నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ మరియు దరఖాస్తు చేసుకునేందుకు పోస్టల్ శాఖ అవకాశం కల్పించింది.
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: ఆగస్టు 31
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 19
ఆన్‌లైన్ దరఖాస్తుల సమయం: సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 21 వరకు
దరఖాస్తుల సవరణ తేదీలు: సెప్టెంబర్ 23, 24
దరఖాస్తు రుసుం: రూ. 100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంది).
పరీక్ష లేదు.. టెన్త్ మార్కులతోనే ఎంపిక
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం) / డాక్‌సేవక్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. పదవ తరగతిలో సాధించిన మార్కుల (ముఖ్యంగా మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాష మార్కులు) ఆధారంగానే ఈ నియామకాలు చేపట్టనున్నట్లు పోస్టల్ శాఖ స్పష్టం చేసింది. అభ్యర్థులకు కనీస కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
జీతభత్యాలు, వయస్సు
బీపీఎం వేతనం: రూ. 12,000 నుంచి రూ. 29,380 వరకు
ఏబీపీఎం/డాక్ సేవక్ వేతనం: రూ. 10,000 నుంచి రూ. 24,470 వరకు
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీల వివరాలు
ఈ విడత నోటిఫికేషన్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 918, తెలంగాణలో 419 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్


