హైదరాబాద్: నగర ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) గుడ్‌న్యూస్ చెప్పింది. నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రయాణ అనుభూతిని అందించేందుకు సరికొత్త 'వీక్లీ పాస్' విధానాన్ని తీసుకువచ్చింది. కేవలం రూ.600 చెల్లించి ఈ పాస్‌ను కొనుగోలు చేస్తే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఏడు రోజుల పాటు ఎన్నిసార్లయినా సిటీ బస్సుల్లో ప్రయాణించవచ్చని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

ఈ వీక్లీ పాస్‌తో గ్రేటర్ పరిధిలోని ఏసీ బస్సులతో పాటు అన్ని రకాల సాధారణ సిటీ బస్సుల్లోనూ అపరిమితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. అయితే, విమానాశ్రయానికి వెళ్లే పుష్పక్ ఎయిర్‌పోర్ట్ లైనర్ సర్వీసులకు మాత్రం ఈ పాస్ వర్తించదని స్పష్టం చేశారు. ఈ పాస్‌లు నగరంలోని అన్ని ప్రధాన ఆర్టీసీ కౌంటర్లలో అందుబాటులో ఉంచామని తెలిపారు. వీటిని కొనుగోలు చేసిన మొదటి రోజు నుంచి సరిగ్గా ఏడు రోజుల పాటు ఈ పాస్ చెల్లుబాటు అవుతుందని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 25 Oct 2026 | 06:06 PM IST
Tags: