ఆమనగల్లు: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈనెల 28న పోలీసు అమరవీరుల జ్ఞాపకార్థం లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు, ఆమనగల్లు పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, క్యాంపు చైర్మన్ జూలూరి రమేష్, లయన్స్ క్లబ్ పీఆర్ఓ పాషా తెలిపారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించారు.
ఆమనగల్లు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉదయం 9 గంటలకు ఈ రక్తదాన శిబిరం ప్రారంభమవుతుందని తెలిపారు. ఆమనగల్లు, మాడుగుల, తలకొండపల్లి మండలాలకు చెందిన యువతీ యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా హాజరై రక్తాన్ని దానం చేసి మరొకరి ప్రాణదాతలు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ రక్తదాన శిబిరంలో కడ్తాల్ ఇన్‌స్పెక్టర్ సైదిరెడ్డి, తలకొండపల్లి ఇన్‌స్పెక్టర్ జానకిరామ్ రెడ్డి, ఆమనగల్లు ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు ముఖ్య అతితులుగా పాల్గొంటారని తెలిపారు.
ఈ సమావేశంలో లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్‌లు ఎం. చంద్రశేఖర్, గంప శ్రీనివాస్, జూలూరి రమేష్, మాజీ జిల్లా చైర్మన్ నటరాజ్ యాదయ్య, క్లబ్ పీఆర్ఓ పాషా, సభ్యులు కొండల్ రెడ్డి, రాములు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.


