షాద్‌నగర్: షాద్‌నగర్ పట్టణంలో జరుగుతున్న చౌరస్తా రహదారి విస్తరణ పనులకు స్థానికుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రహదారిని విస్తరించాలనే ఉద్దేశంతో అధికారులు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోడ్డు విస్తరణ మార్గంలో అడ్డుగా ఉన్న ఆక్రమణలు, డబ్బాలు, మెట్లను తొలగిస్తున్నారు.

తాజాగా ఈ విస్తరణ పనులకు పూర్తి మద్దతు తెలుపుతూ మహారాజా డాబా యజమాని ఆదర్శనీయ నిర్ణయం తీసుకున్నారు. డాబా ఎదురుభాగాన విస్తరణకు అడ్డుగా ఉన్న గోడను తొలగించేందుకు కొంత సమయం కోరిన ఆయన, ఆ వెంటనే తన సొంత ఖర్చులతో, స్వచ్ఛందంగా ఆ గోడను కూల్చివేసి రహదారి విస్తరణకు మార్గం సుగమం చేశారు.

ప్రజల శ్రేయస్సు, వాహనదారుల భద్రతే అన్నిటికంటే ముఖ్యమని భావించి బాధ్యతాయుతంగా వ్యవహరించిన మహారాజా డాబా యజమాని తీరుపై పట్టణ ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చూపిన చొరవ ఇతరులకు స్ఫూర్తిదాయకమని ప్రశంసిస్తున్నారు. రహదారిని ఆక్రమించి ఉన్న మిగతా యజమానులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరిస్తే, చౌరస్తా విస్తరణ పనులు వేగంగా పూర్తై దీర్ఘకాలిక ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 12 Aug 2026 | 07:14 PM IST
Tags: