మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రజాతంత్ర పత్రిక ప్రతినిధి నర్సింహా మాతృమూర్తి గాజుల మణెమ్మ అనారోగ్య కారణాలతో గురువారం కన్నుమూశారు. మాతృమూర్తిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రిపోర్టర్ నర్సింహా కుటుంబాన్ని స్థానిక విలేకరులు, పలువురు ప్రముఖులు పరామర్శించి ఓదార్చారు. ఆమె భౌతికకాయానికి తెలంగాణ రాష్ట్ర మాదిగ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు వత్తుల రఘుపతి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాతృమూర్తిని కోల్పోవడం కుటుంబానికి తీరని లోటని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులంతా మనోధైర్యంతో ఉండాలని ఆకాంక్షించారు.
జర్నలిస్ట్ మాతృమూర్తి మృతి పట్ల స్థానిక మీడియా ప్రతినిధులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు తడక నర్సింహా, దానప్పగారి శేఖర్, నగేష్‌లతో పాటు ఇతర పాత్రికేయులు పాల్గొని మణెమ్మ భౌతికకాయానికి అంజలి ఘటించారు.


