నల్గొండ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 24,26 తేదీలలో నిర్వహించనున్న అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-2), అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి టిజిపిఎస్సి చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి బుర్ర వెంకటేశం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

నల్గొండ పట్టణంలోని నేతాజీ నగర్ (రామగిరి) లో ఉన్న ఎస్పీఆర్ పాఠశాలను పరీక్ష కేంద్రంగా ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నెల 24న జరిగే అసిస్టెంట్ సైంటిస్ట్ పరీక్షకు 185 మంది అభ్యర్థులు, 26న జరిగే అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పరీక్షకు 180 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. అభ్యర్థులు పరీక్ష ప్రారంభ సమయానికి 1 గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని, సమయానికి 30 నిమిషాల ముందే సెంటర్ గేట్లు మూసివేస్తారని స్పష్టం చేశారు.

పరీక్షా కేంద్రం లోపల, వెలుపల తగినంత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీని కోరారు. పరీక్ష రోజున విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి సదుపాయం, వైద్య శిబిరం, మున్సిపల్ పారిశుధ్య చర్యలు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే ఆర్టీసీ అధికారులు విద్యార్థుల రవాణా సౌకర్యార్థం తగినన్ని బస్సులు నడపాలని సూచించారు. ఈ సమీక్షలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 19 Oct 2026 | 10:47 PM IST
Tags: