నాగర్‌కర్నూల్: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల హౌస్ ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఈ ప్రొసీడింగ్స్ అందజేశారు.
స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్‌రెడ్డితో కలిసి మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్రకుమార్ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తామని స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, ఏఈ, పలువురు కౌన్సిలర్లు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్క రాజ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు హాజరైయ్యారు.


