మహేశ్వరం: పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆర్ఎక్స్‌పర్ట్ సూపర్ స్పెషాలిటీ ఈ-క్లినిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పట్నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరం ద్వారా స్థానిక ప్రజలకు అత్యుత్తమ వైద్య పరీక్షలు, సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా మహేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మహేశ్వరం ఫ్యూచర్ సిటీ డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ జానకిరెడ్డిల సహకారంతో ఈ ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో బ్లడ్ ప్రెజర్, హార్ట్ రేట్, ఈసీజీ, బ్రీత్ రేట్, బాడీ టెంపరేచర్, బ్లడ్ గ్లూకోజ్ పరీక్షలతో పాటు పోర్టబుల్ ఎక్స్‌రే, హెచ్‌ఆర్‌వీ వంటి ఆధునిక వైద్య సేవలను ప్రజలకు ఉచితంగా అందించినట్లు వెల్లడించారు. ప్రజలు తమ ఆరోగ్య పరిస్థితిపై అప్రమత్తంగా ఉంటూ అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఈ నెల 30న మెగా రక్తదాన శిబిరం

పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఒక్కో సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఎస్‌హెచ్‌ఓ వెల్లడించారు. అందులో భాగంగా బైక్ ర్యాలీలు, మాదకద్రవ్యాల (డ్రగ్స్) వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన సదస్సులు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 30వ తేదీన పోలీస్ స్టేషన్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజలు, యువత, మీడియా మిత్రులు ఈ కార్యక్రమాలలో భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

inline-img

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్, సీపీఎం నాయకులు దత్తు నాయక్, ఎస్సైలు మారయ్య, ప్రసాద్, ధనుంజయ్, ఏఎస్‌ఐలు శ్రీనివాస్ రెడ్డి, రాంలాల్‌తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 26 Oct 2026 | 09:39 PM IST
Tags: