షాద్‌నగర్: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు షాద్‌నగర్ డీసీపీ షిరీష రాఘవేంద్ర పర్యవేక్షణలో, ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో షాద్‌నగర్ జోన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు.

ఈ రక్తదాన శిబిరానికి షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణతో పాటు జోన్ పరిధిలోని వివిధ స్టేషన్ల సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందితో పాటు స్థానికులు కలిపి మొత్తం 62 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. వీరిలో షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన నలుగురు సబ్‌ఇన్‌స్పెక్టర్లు సైతం రక్తదానం చేసి ప్రజాసేవ పట్ల తమకున్న అంకితభావాన్ని, సామాజిక బాధ్యతను చాటుకున్నారు.

రక్తదానం చేసిన దాతలందరికీ అధికారులు పండ్లు, పండ్ల రసాలను పంపిణీ చేసి అభినందనలు తెలిపారు. పోలీసు అమరవీరుల అత్యున్నత త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమం సేవా దృక్పథానికి, త్యాగానికి, మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లోనూ పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని ఈ శిబిరం చాటిచెప్పింది.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 26 Oct 2026 | 09:35 PM IST
Tags: