చౌదరిగూడెం: సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తూ భక్తిభావాన్ని చాటే శ్రీ శబరిమల మహా పాదయాత్ర విజయవంతం కావాలని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ఆకాంక్షించారు. జిల్లేడు చౌదరిగూడెం మండలం లాల్ పహాడ్ గ్రామం నుంచి ఈ నెల 22వ తేదీన వేదగిరి వేద ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రారంభం కానున్న శ్రీ శబరిమల మహా పాదయాత్రకు అంజయ్య యాదవ్ రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు.
ఈ పాదయాత్రకు మద్దతుగా, స్థానిక మండల నాయకుల సమక్షంలో బీఆర్ఎస్ యువ నాయకుడు మురళీకృష్ణ యాదవ్ సోమవారం పాదయాత్ర బృంద సభ్యులకు రూ.50 వేల నగదును ప్రత్యక్షంగా అందజేశారు. ఈ సందర్భంగా పాదయాత్ర బృంద సభ్యులు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్కు, మురళీకృష్ణ యాదవ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మురళీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. భక్తి, ఆధ్యాత్మికత, స్వామివారి సేవాభావంతో చేపట్టే ఎలాంటి సత్కార్యాలకైనా తమ కుటుంబం, నాయకుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీధర్ రెడ్డి, బంగారు స్వరూప రాములు, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.


