ఎన్మనబెట్ల: భారత దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎన్మనబెట్ల గ్రామపంచాయతీలో అత్యంత ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సింధుజ సురేందర్ రావు ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసి, త్రివర్ణ పతాకానికి ఘనంగా గౌరవ వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. గ్రామ ప్రజలందరిలో దేశభక్తి, జాతీయ ఐక్యత, సోదరభావాన్ని మరింతగా పెంపొందించేలా ఈ వేడుకలు సాగాయి. జెండా ఒక్కటే, దేశం ఒక్కటే, మనమంతా భారతీయులమే అనే స్పూర్తిని ఈ వేడుకలు చాటిచెప్పాయి.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు, ఉప సర్పంచ్ నేనావత రమేష్ నాయక్, వివిధ వార్డుల సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, స్థానిక గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేడుకల అనంతరం అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మిఠాయిలు పంపిణీ చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 15 Aug 2026 | 05:24 PM IST
Tags: