ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం కోనాపూర్ గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం దుర్గామాత సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆమనగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అండేకార్ యాదిలాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసి, అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్మాత దివ్య ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పూజా కార్యక్రమాల అనంతరం రాత్రి వేళ అమ్మవారి మండపం వద్ద నిర్వాహకులు భక్తుల కోసం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో దుర్గామాత సేవా సమితి కమిటీ సభ్యులు ఎన్.టి. పంచాక్షరీ, ఆకిటి మల్లేష్, జాజాల కుమార్ యాదవ్, పెండ్యాల శివకృష్ణ, శ్రీనాథ్, పురుగుల కిష్టయ్య, గొడుగు రమేష్, జగన్, శివ కుమార్, గణేష్, కుమార్, రాజు, రమేష్, మహేష్, ఈదమయ్య, వెంకటయ్య, సాయి, ఎం. రాజు, బాల్ రెడ్డి, మల్లేష్, వీరయ్య, భాస్కర్, హనుమంతు, మహేందర్, శివ తదితరులు పాల్గొని సేవనందించారు.


