మాడుగుల: రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అవురుపల్లి గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక భక్తిభావంతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం గ్రామంలో ప్రతిష్ఠించిన అమ్మవారు భక్తులకు కాళికాదేవి అలంకారంలో దివ్య దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఓఓ (TASK-C.O.O) సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అవురుపల్లిలోని అమ్మవారి ఉత్సవ మండపాన్ని సందర్శించారు.

కాళికాదేవి రూపంలో కొలువుదీరిన జగన్మాతను ఆయన దర్శించుకుని, వేదమంత్రాల నడుమ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దుర్గాభవానీ అమ్మవారి దివ్య ఆశీస్సులతో అవురుపల్లి గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. గ్రామంలో ఎల్లప్పుడూ సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్థానిక నాయకులు, పుర ప్రముఖులు అల్వాల కృష్ణయ్య, బాలమోని కాటమరాజు, కేశమోని వెంకటయ్య, బాలమోని బాలకృష్ణ, బాలమోని శ్రీనివాస్, గౌని రమేష్, చిక్కల రాజు, మరియు యువజన నాయకులు బాలమోని శివ, అల్వాల చింటు తదితరులు పాల్గొని పూజలు నిర్వహించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 19 Oct 2026 | 10:23 PM IST
Tags: