భువనేశ్వర్: ఒడిశా నూతన గవర్నర్‌గా బ్రజ్ మోహన్ రామ్ ఆదివారం భువనేశ్వర్‌లోని లోక్ భవన్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. నూతన గవర్నర్‌తో ఒడిశా హైకోర్టు ప్రధానమూర్తి జస్టిస్ హరీష్ టండన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, కేంద్ర మంత్రి జుయల్ ఓరం, అసెంబ్లీ స్పీకర్ సురమ పధి, రాష్ట్ర మంత్రులు, పలువురు సీనియర్ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
గతంలో డాక్టర్ హరిబాబుకంభంపాటి స్థానంలో ఒడిశా గవర్నర్‌గా బ్రజ్ మోహన్ రామ్ బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 12వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను ఈ అత్యున్నత రాజ్యాంగ పదవికి నియమించారు. జార్ఖండ్‌లోని పలాము నియోజకవర్గం నుంచి మూడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా (ఎంపీ) సేవలందించిన ఆయన, ప్రస్తుతం ఒడిశా రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతిగా తన ప్రస్థానాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
అంతేకాకుండా, భారతదేశ చరిత్రలోనే రజక (ధోబీ) వర్గం నుంచి గవర్నర్ పదవిని అధిష్టించిన తొలి వ్యక్తిగా బ్రజ్ మోహన్ రామ్ అరుదైన ఘనత సాధించడం విశేషం. ఈ నియామకం పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.


