ఫరూఖ్‌నగర్: రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరింది. గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు శివ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులు, యువకులు సోమవారం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నూతనంగా పార్టీలోకి వచ్చిన వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో రుస్తుం, నర్సింలు, లింగం, చందు, రమేష్, శివ, నందు, ప్రసాద్, ఆకాష్, వినయ్, రాకీ, హరీష్, నరేష్, చింటూ, యశ్వంత్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు ఉన్న ఆదరణకు ఈ చేరికలే సజీవ నిదర్శనమని స్పష్టం చేశారు.
గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవం ఉంటాయని భరోసా ఇచ్చారు. కాగా, నాయకత్వంపై నమ్మకంతోనే తాము బీఆర్ఎస్‌లో చేరామని, రాబోయే రోజుల్లో పార్టీ విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చేరిన నాయకులు తెలిపారు. ఈ చేరికలతో అయ్యవారిపల్లి బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్సాహం నెలకొంది.


