హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార, ఔషధాల నాణ్యత ప్రమాణాలను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన 'టీజీ సేఫ్' (తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్) కమిషనర్‌గా అవినాశ్ మహంతి సోమవారం అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు.

ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు, ప్రామాణికమైన ఔషధాలు అందేలా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఆహార భద్రత మరియు ఔషధ నియంత్రణ విభాగాలను విలీనం చేసి 'టీజీ సేఫ్' వ్యవస్థను రూపొందించింది. ఈ నూతన శాఖకు డైరెక్టర్ మరియు కమిషనర్‌గా అవినాశ్ మహంతి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 17 Aug 2026 | 05:14 PM IST
Tags: