షాద్నగర్: పట్టణాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజారోగ్య పరిరక్షణకు శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని పలువురు ప్రముఖులు కొనియాడారు. దీపావళి పండుగ సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో రాజస్థానీ మార్వాడీ సమాజ్ సంఘం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నూతన దుస్తుల పంపిణీ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బసవేశ్వర్, ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ సీతారాంలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో నిరంతరం శ్రమిస్తున్న 210 మంది పురుష, మహిళా పారిశుద్ధ్య కార్మికులకు నాయకులు, అధికారులు కలసి నూతన దుస్తులను అందజేశారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ సమాజంలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు. పండుగల వేళ కార్మికుల ముఖాల్లో సంతోషాన్ని నింపేందుకు మార్వాడీ సమాజ్ సంఘం ప్రతి సంవత్సరం ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో స్ఫూర్తిదాయకమని అభినందించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు పెంటయ్య, రాజు నాయక్, రాజస్థానీ మార్వాడీ సమాజ్ సంఘం ప్రతినిధులు దిలీప్ గౌర్, రాధేశ్యామ్ గౌర్, బీర్బల్ చౌదరి, భన్వర్ సిర్వీ, కైలాశ్ సిర్వీ, తిరుపతి, జైథారామ్ చౌదరి, మనోజ్ గౌర్, ప్రకాశ్ గౌర్, సత్యనారాయణ్ గౌర్, ప్రకాశ్ మాలి, మహేంద్ర కుమార్ మాలి, మహేంద్ర గౌర్, పవన్ కుమావత్, కాలురామ్ సిర్వీ, బలబీర్ సింగ్, కిషన్ మాలి, రాజేంద్ర సింగ్ సిర్వీ, దేవా రామ్ కుమావత్, సుగన్ చంద్ కుమావత్, బాలాజీ ధాబా, రామ్ సుఖ్ భాటి, బాలాజీ రామచంద్ర, మాంగీలాల్ కుమావత్, మోటా రామ్ కుమావత్, మహేంద్ర సిర్వీ, బినోద్ కుమార్ గౌర్, శ్రీ మహాదేవ్, రాందేవ్ మార్బల్, మహేంద్ర కుమావత్ తదితరులు పాల్గొన్నారు.


