షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో ముదిరాజ్ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సోమవారం ఘనంగా శ్రీకారం చుట్టారు. భవన నిర్మాణ పనులకు సంబంధించి మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందె మోహన్, మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డిలతో కలిసి ముగ్గు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముదిరాజ్ సంఘం సభ్యుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసి ముగ్గు వేశామని తెలిపారు. ఈ నూతన భవనం నిర్మాణ పనులు త్వరలోనే పూర్తయి అందుబాటులోకి వస్తుందన్నారు. కమ్యూనిటీ హాల్ సిద్ధమైతే సంఘ సమావేశాలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు, శుభకార్యాల నిర్వహణకు స్థానిక ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సి. పెంటయ్య, శ్రీశైలం గౌడ్, మున్సిపల్ డీఈ నరేష్, ఏఈ సాయి కిరణ్‌లతో పాటు ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 26 Oct 2026 | 09:28 PM IST
Tags: