షాద్‌నగర్: షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో పోలీసు అన్నయ్యలకు ముందస్తు రక్షాబంధన్ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. బీజేవైఎం అసెంబ్లీ ఇన్‌చార్జ్ పుట్నాల సాయికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) కె. సీతారాంకు బీజేవైఎం నాయకులు ముందస్తు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేవైఎం మహిళా నాయకులు, కార్యకర్తలు పోలీసు సిబ్బందికి రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అంకితభావంతో అందిస్తున్న సేవలను నాయకులు ఈ సందర్భంగా కొనియాడారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో కుటుంబానికి దూరంగా విధుల్లో ఉంటూ ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీసుల సేవలు ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య పవిత్ర ప్రేమ, ఆత్మీయతకు ప్రతీక అని, రాత్రింబవళ్ళు శ్రమించే పోలీసు సిబ్బందితో సోదరభావాన్ని పెంపొందించుకునేందుకే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేవైఎం నాయకులు తెలిపారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషికి కృతజ్ఞతగా ఈ వేడుకలు చేపట్టామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫరూక్‌నగర్ మండల అధ్యక్షుడు వివేక్, విజయ్, ప్రశాంత్, రాధిక, నందిని, పూజ, ఫలక్, మనోజ్ఞ, శ్రేయ, హరిక, సరిత, నందిని, శ్రీనిధి, శ్రీజతో పాటు పలువురు బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు మరియు షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


