కొత్తూర్: జె.పి. దర్గాలో మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ముస్లిం సోదరులకు మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దర్గా నుంచి నిర్వహించిన మిలాద్-ఉన్-నబీ ర్యాలీలో పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి నడిచారు.

మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, ప్రేమ, దయ, సోదరభావం వంటి విలువలు సమాజానికి ఎంతో ఆదర్శప్రాయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలందరూ ఐకమత్యంతో, పరస్పర గౌరవంతో జీవిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. మిలాద్-ఉన్-నబీ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సంతోషం, సౌభ్రాతృత్వాన్ని తీసుకురావాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లలిత గోపాల్ నాయక్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ లావణ్య దేవేందర్ యాదవ్, మాజీ సర్పంచ్ మిట్టు నాయక్, మాజీ మండల అధ్యక్షులు పెంటనోళ్ళ యాదగిరి, మాజీ కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రవీందర్ నాయక్, నాయకులు తస్లీమ్, రవి, యాదగిరి, పాపయ్య యాదవ్, గోపి నాయక్, రాఘవేందర్, రాము నాయక్, మోహన్, మల్లేష్, ముఖీద్, హనుమంతు, సోమ్లా నాయక్, లింగ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 26 Aug 2026 | 02:11 PM IST
Tags: