కోరుట్ల: గృహాలు, వ్యాపార సముదాయాలకు స్మార్ట్‌మీటర్లు బిగించే నిర్ణయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల పట్టణంలో నిరసన గళం వినిపించారు. గురువారం పట్టణంలోని ప్రధాన కూడలైన అంబేడ్కర్‌చౌరస్తాలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపి రాస్తారోకో నిర్వహించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం ప్రజలకు వ్యతిరేకమైన విధానాలకు పాలుపడుతున్నాయని ఈ సందర్భంగా నాయకులు తీవ్రంగా ఆరోపించారు. తెలంగాణ రక్షణ సమితి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ రఘునందన్‌రావు (డాక్టర్‌ రఘు) ఆధ్వర్యంలో ఈ రాస్తారోకో కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా డాక్టర్ రఘు మాట్లాడుతూ.. సామాన్య ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపేలా స్మార్ట్‌మీటర్ల విధానాన్ని తీసుకురావడం దుర్మార్గమన్నారు. ప్రజల నడ్డి విరిసే ఈ విధానాన్ని ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని హెచ్చరించారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ రక్షణసమితి నాయకులు సుకేందర్‌గౌడ్‌, అజ్జార్‌, రేండ్ల రాజన్న, లింగంపల్లి సంజీవ్‌, సాయిరెడ్డి తదితరులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 28 Aug 2026 | 12:18 AM IST
Tags: