కొల్లాపూర్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎన్మనబెట్ల గ్రామంలో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా హరితహారం కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. గ్రామాన్ని మరింత పచ్చగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సర్పంచ్ సింధుజ సురేందర్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో మొక్కలు నాటి, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు.
మొక్కను నాటుదాం.. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.. భావితరాలకు పచ్చని భవిష్యత్తును అందిద్దాం అనే నినాదంతో ముందుకు సాగుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రటరీ బి. శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ రజిత భాస్కర్ గౌడ్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహ, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ సిబ్బంది, గ్రామ ప్రజలు, యువత, రాజకీయ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


