హైదరాబాద్: నగరంలో మిలాద్-ఉన్-నబీ శాంతి ర్యాలీల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు, మళ్లింపులను ప్రకటించారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నగరంలోని పలు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయడం లేదా దారి మళ్లించడం జరుగుతుందని హెచ్చరించారు. ఫలక్‌నామా నుంచి చార్మినార్ మీదుగా వోల్టా హోటల్ వరకు, యహియా పాషా దర్గా నుంచి వోల్టా హోటల్ వరకు, మక్కా మస్జిద్ నుంచి నాంపల్లిలోని హజ్ హౌస్ వరకు, అలాగే పత్తర్‌గట్టి నుంచి అలిజా కోట్ల వరకు ప్రధాన ఊరేగింపులు సాగనున్నాయి.
ఈ క్రమంలో ఫలక్‌నామా, చార్మినార్, మదీనా జంక్షన్, నాయపూల్, అఫజల్‌గంజ్, ఎంజే మార్కెట్, నాంపల్లి తదితర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రయాణ సమయంలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ఏదైనా అత్యవసర సహాయం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్ 9010203626ను సంప్రదించాలని కోరారు.


