ఎన్మనబెట్ల: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision - SIR) కార్యక్రమంలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితా విడుదలయింది. ఈ నేపథ్యంలో ఎన్మనబెట్ల గ్రామపంచాయతీలో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బూత్ స్థాయి అధికారులు (BLO), వివిధ పార్టీల స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఓటరు జాబితాలో పేరు లేకపోయినా లేదా పేరు, చిరునామా, ఇతర వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత బీఎల్‌వో, ఈఆర్వో లేదా ఏఈఆర్వో అధికారులను సంప్రదించి క్లెయిమ్‌లు లేదా అభ్యంతరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటరు వివరాలను సరిచూసుకోవాలని సర్పంచ్ కోరారు.


