పశ్చిమాసియా సంక్షోభాన్ని తట్టుకుని నిలబడి దేశ ఆర్ధిక వ్యవస్థ తన బలాన్ని చాటుకుందని, శరవేగంతో అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థల జాబితాలో మనం ఉన్నామని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వం తీసుకున్న పొదుపు చర్యలు ఎంతగానో పనిచేశాయన్నారు. విదేశీ వస్తువుల కన్న స్వదేశీ మిన్న అనే సూత్రాన్ని పాటించాల్సిందిగా ప్రధానమంత్రి దేశ ప్రజలకిచ్చిన పిలుపునకు మంచి స్పందనే వచ్చిందని ఆర్ధికమంత్రి పేర్కొన్నారు.
ఎల్ నినో ప్రభావం....
యుద్ధ ప్రభావం నుంచి తప్పించుకుని నిలబడగలిగిన మన ఆర్ధిక వ్యవస్థ మరి ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ ఏడాది వర్షాకాలం జూన్ మాసంలో ఇప్పటి వరకు 40 శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు అంచనా. జూలై లో కూడాచిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఇదే జరిగితే దీని ప్రభావం ఆర్ధిక వ్యవస్థకు అండగా నిలిచే పలు రంగాలపై పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఆర్ధిక వ్యవస్థపై ఒత్తిడి పెంచే అవకాశం లేకపోలేదు. వర్షాధారంపై ఆధారరపడిన పంటల దిగుబడి తగ్గడం, ప్రాజెక్టులలో నీటి లభ్యత గణనీయంగా పడిపోవడం జరగవచ్చు. అలాగే వ్యవసాయాధారర ఉపాధి అవకాశాలు సన్నగిల్లే అవకాశం ఉంది. మరోవైపు ఆర్ధికరంగంలో వ్యవసాయ రంగం వాటా తగ్గేఅవకాశం ఉంది. ఇది పలు సైక్లికల్ పరిణామాలకు దారితీసి అంతిమంగా ఆర్ధిక రంగంపై ఒత్తిడి పెంచవచ్చు. పంటదిగుబడి తగ్గితే నిత్యావసర సరకులు ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీసే ప్రమాదమూ లేకపోలేదు. ఇటువంటి పరిస్థితులలో ప్రస్తుత వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకుని ఆర్ధిక వ్యవస్థను పరుగులు పెట్టించడం ఒక సవాలు కాగలదు.
2000 సంవత్సరం తర్వాత మన దేశంలో 2002–03 లో, 2009–2010లో, 2023–24 లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు మళ్లీ ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. దీనితో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. ఇంధన వినియోగ డిమాండ్ పెరగడం ఒక ఎత్తు అయితే , జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గనుండడం మరో పరిణామం. అయితే ప్రస్తుత ఎల్ నినో పరిస్థితులపై పెద్దగా ఆందోళన అవసరం లేదని నిపునులు చెబుతున్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావాన్ని తట్టుకోగలగి నిలడినా , ఎల్ నినోప్రభావాన్ని తట్టుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు సమష్టి కృషి సాగించాలి. లేకుంటే ఆర్ధిక వ్యవస్థ పురోగతికి ఇది అవరోధంగా మారే అవకాశం ఉంది.
Read latest Business News and Telugu News
Updated: 10 Jul 2026 | 12:46 PM IST


