ఫరూఖ్‌నగర్: రవాణా సౌకర్యం లేక గత ఐదేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని చింతగూడ గ్రామస్తుల చిరకాల కల ఎట్టకేలకు నెరవేరింది. గ్రామానికి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసు పునఃప్రారంభం కావడంతో ప్రజల సుదీర్ఘ రవాణా కష్టాలకు ముగింపు పడింది. స్థానిక సర్పంచ్ నరేష్ నేతృత్వంలో ఫరూఖ్‌నగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై, రిబ్బన్ కట్ చేసి ఈ నూతన బస్సు సర్వీసును లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితోనే నాణ్యమైన జీవనం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా సరైన బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు బస్సు అందుబాటులోకి రావడంతో సమయానికి పాఠశాలలకు, కళాశాలలకు, ఉద్యోగాలకు వెళ్లేందుకు మార్గం సుగమమైందన్నారు. ఈ బస్సు సర్వీస్ చింతగూడతో పాటు మార్గమధ్యలో ఉన్న పలు గ్రామాల ప్రజలకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

inline-img

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు

చింతగూడ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు గ్రామస్తులు, పాలకవర్గ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే చూపుతున్న చొరవకు ఇది నిదర్శనమని కొనియాడారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ముఖ్య నాయకులను గ్రామపంచాయతీ పాలకవర్గం శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపింది.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శంకరయ్య, సర్పంచులు ఆర్. బాబు నాయక్, శివకుమార్ యాదవ్, కాంగ్రెస్ ఎస్సీ విభాగం నియోజకవర్గ చైర్మన్ జాంగారి రవి, మండల నాయకులు పుల్లారెడ్డి, కావాలి శ్రీశైలం ముదిరాజ్, జాంగారి జంగయ్య, యాదయ్య గౌడ్, ఈరమొని రాజు, మాజీ సర్పంచులు చింతగూడ ఆనంద్, ఆగమయ్య, అన్నారం బాలు నాయక్, మట్ట వెంకటేష్ గౌడ్, కొమ్మగంటి శ్రీహరీ గౌడ్, వీర్లపల్లి శివ, స్థానిక నాయకులు రాజుతో పాటు గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 27 Oct 2026 | 09:41 PM IST
Tags: