బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2026 పోస్టర్ ఆవిష్కరణ
బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) ఆధ్వర్యంలో 'యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2026 - సీజన్ 2' పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై షార్ట్ ఫిలిమ్స్, పాటలు, డాక్యుమెంటరీలు, ఆర్టికల్స్ వంటి విభాగాలలో ఈ పోటీలు జరగనున్నాయి. ఆసక్తి గల వారు సెప్టెంబర్ 15, 2026లోపు తమ ఎంట్రీలను పంపవచ్చు.